పయనించే సూర్యుడు జూన్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంధాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు , పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మరణించిన పెద్దలను స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన స్వర్గంలో ఉన్న జీవులకు సద్గతి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, శ్రీలక్ష్మి ,శివాని తదితరులు పాల్గొన్నారు.