నేటి తరం యువత అల్లూరి పోరాటస్పూర్తిని కొనసాగించాలి.

★ అఖిలపక్షం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ పిలుపు. ★ అల్లూరి సీతారామారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు.

పయనించే సూర్యడు జులై.05.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండల పరిధిలోని ఇందుకూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు 130 వ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు.వేసి నివాళులు అర్పించిన అఖిలపక్షం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆనాడు రంప ప్రాంతంలో ఇటువంటి కమ్యూనికేషన్,చదువు లేని ఆదివాసీ ప్రజలకు జరుగుతున్న అక్రమాలు,అన్యాయాల పై ప్రజలను చైతన్యం చేసి భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుండి తరిమికొట్టడంలో కీలకపాత్ర వహించారన్నారు.వీరితోపాటు గాం గంట దొర,గాం మల్లు దొర,మర్రి కామయ్య మొదలైన వారు ఎందరో పాల్గొని ప్రాణ త్యాగం చేశారన్నారు. మన్యం వీరుల్లో ఒకరైన అల్లూరి సీతారామరాజు నేటి తరం యువతీ,యువకులకు స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో నేటితరం యువతీ,యువకులు ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయులపై,చట్టాలు హక్కులపై జరుగుతున్న దాడుల పై ఆదివాసీలంత ఐక్యంగా మరో మలిదశ శాంతియుత ఉద్యమానికి సిద్ధం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అయినాల శ్రీనివాసు,ఆదివాసి మహాసభ జిల్లా అధ్యక్షులు మడకం బంగారు బాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి అరగటి వీరభద్రారెడ్డి,అరగటి నాగిరెడ్డి,కెచ్చెల ముద్దులరెడ్డి,పచ్చుకూరి గౌరీ శంకర్, పచ్చుకూరి అర్జునుడు,మూలెం బుచ్చిరాజు,బండారి వీరబాబు,కోనపర్తి ప్రసాద్, మాలపర్తి ఈసు,మన్నేపల్లి కోటి,కొట్టెం బన్నీ,మాదాల షణ్ముఖ,ఈరేటి యువ కిరణ్ మొదలైన వారు పాల్గొన్నారు.