నేడు పేదల గడపగడపకు మిషన్ వాక్.. బాధితుల పరామర్శకు డాక్టర్ బాదావత్ రవి పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ జులై 5 సింగరేణి రిపోర్టర్ నరేష్ మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాదావత్ రవి ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సేవా పర్యటన నిర్వహించనున్నారు. పక్షవాతం, వికలాంగులు, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులను వారి నివాసాల వద్దకు వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అవసరమైన వైద్య సూచనలు, సహాయ సహకారాలు అందించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బొక్కల తండా, విశ్వనాధపల్లిలో శ్రీ హట్కార్ రాంబాబు గారితో కలిసి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు భిక్య తండాలో శ్రీ రాంకీ గారితో కలిసి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సూర్య తండాలో పర్యటించి, జమ్మూ కాశ్మీర్‌లో దేశ సేవలో అమరుడైన ఆర్మీ జవాన్ అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సంఘీభావం తెలియజేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేరెపల్లిలో శ్రీనివాస్ గారితో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించనుండగా, సాయంత్రం 3 గంటల నుంచి మేకల తండా, దుబ్బ తండాలలో టీచర్ హరి గారితో కలిసి బాధితులను కలవనున్నారు. అనంతరం గంగరాం తండాలో సర్పంచ్ కిరణ్ గారితో కలిసి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. "సేవే పరమో ధర్మః" అనే మహోన్నత లక్ష్యంతో మిషన్ వాక్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ బాదావత్ రవి గ్రామాల్లో పర్యటిస్తూ పేదలు, వికలాంగులు, పక్షవాత బాధితులు, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు ధైర్యం నింపుతూ, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ మానవతా సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గ్రామ సేవా కార్యక్రమంలో మిషన్ వాక్ ఫౌండేషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీం మిషన్ వాక్ విజ్ఞప్తి చేసింది.