నేడే హిందూ సమ్మేళనం

పయనించే సూర్యుడు న్యూస్ మే 22 బోధన్ :బోధన్ పట్టణంలోని బురుడు గల్లి లో గల విష్ణు మందిరం వద్ద శుక్రవారం సాయంత్రం 5:30 నిమిషాలకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పాల్గొంటున్నట్లు తెలిపారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి హిందు సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.