పయనించే సూర్యుడు.. న్యూస్.. మే..22 మృతుల కుటుంబాలకు సాయం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం,కొత్త కొత్తూరు,అప్పుల నర్శింహ పురం,బుద్దారం,గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు PSR ట్రస్ట్ ద్వారా పది వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పది వేల రూపాయల సహాయాన్ని మృతుల కుటుంబాలకు అందజేశారు.మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈసందర్భంగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ గృహ, నిర్మాణం, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వైపు ప్రభుత్వ నిధులతో పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తో పాటు PSR ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తో ఆయా గ్రామాల సర్పంచ్ లు స్థానిక నాయకులు పాల్గొన్నారు