నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

పయనించేసూర్యుడు..న్యూస్.09..నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77 వ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్ముకున్న వారికి న్యాయం చేయడం వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేర్చుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్చిపోలేని పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ని ఆయన కొనియాడారు. ఆరోగ్య శ్రీ,108 ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన కృషి చేసారని తెలిపారు.ఆనాడు నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే అని ఆయన చెప్పారు. రాజకీయాల్లో సైతం స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ని అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.