నేలకొండపల్లి లోని ఎస్సీ, బీసీ కాలనీలో రేషన్ షాప్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు

పయనించే సూర్యుడు.. 05.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లెక్సీ కి పంచామృతాభిషేకం చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ ప్రజలు రేషన్ కోసం నేలకొండపల్లి పట్టణానికి వెళ్లి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వృద్ధులు, వికలాంగులు అంతదూరం వెళ్లలేకపోవడం తో డీలర్ తో మాట్లాడి రేషన్ సెంటర్ ఏర్పాటు చేయించమన్నారు.కాలనీలో నీటి సమస్య తీర్చేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50 లక్షల రూపాయల తో ఓవర్ హెడ్ ట్యాన్క్ మంజూరు చేయించారని ఆయన తెలిపారు.దాని నిర్మాణం త్వరలోనే చేపడతారని ఆయన పేర్కొన్నారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడాలి గోవింద రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్,నాయకులు నెల్లూరి భద్రయ్య,బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న,జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు