పంటల వ్యర్ధాలు, వరి కొయ్యలను కాల్చవద్దు

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23,తల్లాడ రిపోర్టర్ ఈ రోజు తల్లాడ మండలంలోని రామానుజవరం క్లస్టర్, పినపాక రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఇన్‌చార్జి శాస్త్రవేత్తలైన డా॥ బి. జాంబుమ్మ మరియు డా॥ ఆర్. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి డా॥ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, భూసారాన్ని పెంచుకోవాలని, అవసరం మేరకే రసాయనాలను వాడాలని, సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నీటి ఆదా చర్యలను చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పంట మార్పిడి పద్ధతులను అనుసరించి అధిక ఆదాయాన్ని పొందాలని మరియు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలని వరి కొయ్యలు మరియు మొక్క జొన్న పంట అవశేషాలు ని తగలబెట్టకుండా భూమిలో కలియదున్నుకోవాలని రైతులు వరి కొయ్యలను కాల్చడం వలన కలిగే నష్టాలు ను రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా॥ బి. జాంబుమ్మ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు యాంత్రీకరణ వైపు వెళ్లాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి మంచి దిగుబడులను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. శ్రీనివాసరావు , ఉపాధ్యాయులు ఎస్‌కే. జాన్ పాషా గారు, మండల వ్యవసాయ అధికారి ఎండి. తాజుద్దీన్ ,వ్యవసాయ విస్తరణాధికారి జి. శివకుమార్ మరియు ఎరువ గోపాలరావు, ఆళ్ళ శ్రీను, అమరం రాము, నర్వనేని శ్రీనివాసరావు పాల్గొని రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమం రైతుల విశేష స్పందన మధ్య ఘనంగా ముగిసింది.