పంట కాలువ చెంతనే ఉప్పునీటి చెరువులు .

..,ఉప్పునీరుతో కలుషితం అవుతున్న పంటకాలువ ... పట్టించుకోని ఇరిగేషన్,మత్యశాఖ అదికారులు

పయ నించే సూర్యుడు మే 26 ముమ్మిడివరం మండలంలోని అనాతవరం. నుండి మల్లాయిపాలెం మీదుగా అయినాపురం వేల్లే ప్రదాన పంట కాలువచెంతనే పెయ్యలవారి పేట సమీపం నుండి బోండాయికోడు తూము వరకు సుమారు 30 ఎకరాల ఉప్పునీటి రొయ్యల సాగు యాదేశ్శగా కొనసాగుతున్నాయి అయితే నిబంధనలు ప్రకారం ప్రదాన పంట కాలువ చెంతనే ఉప్పునీటి రొయ్యల చెరువులు సాగు చెయ్యడం నిబంధనలకు విరుద్దం అయినప్పటికీ పంట కాలువ ఛెంతనే యాదేశ్శగా ఉప్పునీటి రోయ్యల చెరువులు సాగు చెయడం జరుగుతుంది అని పలువురు వ్యవసాయ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉప్పునీటి చెరువులు నుండి ఉప్పునీరు ప్రదాన పంట కాలువలోకి కలవడం ద్వారా వందలాది ఎకరాలు వరిపొలాలు ఉప్పునీటి వలన దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపొతున్నామని, అనాతవరం, మల్లాయిపాలెం, చెయ్యేరు, బోండాయికొడు, స్వామిదేవరపాలెం గ్రామలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలగా ముమ్మిడివరం చివరు పెయ్యలవారి పేటకు అనుకొని పంట కాలువ పక్కనే రోయ్యల చెరువులు సాగు చేస్తు వాటి నుండి వ్యర్ద జలాలు కాలువలో కలుషితం అవుతున్న రెవెన్యూ, ఇరిగేషన్, మత్యశాఖ అదికారులు అటువైపు కన్నెత్తి చుడకపొవడం పలు అనుమానాలకు తావిస్తుందనీ రైతులు పేర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులు రోయ్యల చెరువులు తవ్వకాలు చెయ్యాలి అంటే వ్యవసాయ పంటలకు పనికి రాని భుములు అయ్యివుండాలి పక్కనే ఉన్న రైతులు అనుమతి తప్పనిసరిగా వుండాలి, పక్కనే ఉన్న రైతుల పొలాలకు నష్టం వాటిల్లికుండా చెరువులు గట్లు నుండి పది మీటర్ల ఊట బోదులు తవ్వి వాటి ద్వారా మురుగునీటి డ్రెయినేజీలకు ఊట నీరు తరలించాలనీ నిబంధనలు ఉన్నాయి అయితే ఈప్రాంతంలో ఎకంగా పంటకాలువ గట్టునే చెరువులు గట్ఠుగా ఆక్రమించి యాదేశ్శగా ఉప్పునీటి చెరువులు సాగు చేస్తున్నారు అని రైతులు చెబుతున్నారు పంట కాలువకు ఉప్పునీటి చెరువులకు మద్య ఊట భోది లేకపోవడం వలన వందలాది ఎకరాలు వరిపొలాలు ఉప్పుకయ్యలుగా మరే పెను ప్రమాదం పొంచి వుంది అని తక్షణమే ఇరిగేషన్, రెవన్యు,ఫిషరిష్ అదికారులు స్పందించి పరిష్కారం చుపాలని రైతులు కొరుతున్నారు పట్టించుకోనీ ఇరిగేషన్,మత్యశాఖ అదికారులు పంట కాలువలు చెంతనే యాదేశ్శగా అక్రమ ఉప్పునీటి రోయ్యల చెరువులు సాగు జరుగుతున్నప్పటికి ఇరిగేషన్ ,మత్యశాఖ అదికారులు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అదికారులు స్పందించకపొతే రైతులు అంతా కలిసి పోరాటం చేస్తామని నాలుగు గ్రామల రైతులు హెచ్చరిస్తున్నారు