
పయనించే సూర్యుడు న్యూస్ : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ తే 2.10.2026సోమవారం బుచ్చయ్యపేట మండలంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.ఆశా దేవి ఆర్నబ్ తుఫాను వల్ల నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు ఇందులో భాగంగా 31-10-2026(శనివారం )తేదీన కురిసిన అకాల వర్షం వలన చిన్నపన్నపాలెం గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న వరి పొలాలు లో నీరు ఎక్కువ అవ్వటం వలన మరల వరి పొలాలు నీట మునిగినవి అని ఈ మునిగిన వరి పొలాలను సోమవారం నాడు జిల్లా వ్యవసాయ అధికారిణి పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. , రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నుండి వారం రోజులపాటు(02-11-2026 నుండి 06-11-2026) రైతన్న మీకోసం అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి తుఫాను ప్రభావం వల్ల జరిగిన కష్ట- నష్టాలు, అదే విధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ
పథకం కోసం ప్రతి ఒక్క రైతుకి వివరించాలి, రబీ పంట కాలం కి సంబంధించి ఏ పంటలు వేసుకోవాలో రైతులకి అవగాహన కల్పించి ప్రస్తుత పరిస్థితులు బట్టి వాళ్లు ఏ పంటలు పండించాలో తగు సలహాలు సూచనలు ఇవ్వాలి అని ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం అధికారి హేమంత్, రైతులు పెంరెడ్డి.చిరంజీవి,దుబాసి ఈశ్వరావు, పోతు. నరేష్, పోతు. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.