
పయనించే సూర్యుడు, నవంబర్ 02 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఉమ్మడి చందానగర్ డివిజన్ లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్య క్రమంలో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై డివిజన్ ముఖ్య నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున ముఖ్య నాయకులు అందరూ కలిసికట్టుగా ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. డివిజన్ కు 3000 నుంచి 4000 ఓట్లు నమోదు చేయించాలని, ప్రతి ఓటరు బీఆర్ఎస్ కు ఓటు వేసేలా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి చందానగర్ డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి నిర్వహించారు.