పత్తికుంటపల్లిలో సర్పంచ్ జుట్టు శేఖర్,సీసీ రోడ్డు పనులకు నిర్మాణం.

పయనించే సూర్యుడు న్యూస్:, మే /30:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూ ర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని పత్తికుంటపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ జుట్టు శేఖర్, శుక్రవారం ప్రారంభించారు. 120 మీటర్ల పొడవుతో సుమారు రూ.5 లక్షల అంచనా వ్యయంతో ఈ సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగానే ఈ పనులు చేపడుతున్నామని సర్పంచ్ జుట్టు శేఖర్, సి సి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్, ఉప సర్పంచ్ మనోహర్ రెడ్డి, ఏఈ రాజేష్, గ్రామ కార్యదర్శి సాయి సుధ, వార్డు సభ్యులు,భారతి,పూజ,రాజమణి, రవి. భాస్కర్,చింతాలపల్లి చిన్న శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ ,రమణ రెడ్డిలు. తదితరులు పాల్గొన్నారు.