పబ్లిక్ సర్వీసింగ్ సెంటర్ గా మారిన ఆదోని మున్సిపాలిటీ

పయనించే సూర్యుడు జూన్14ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ప్రజా పరిపాలన మున్సిపాలిటీ ఆఫీస్ ముందు పబ్లిక్ గా కార్లు వాటర్ సర్వీసింగ్ చేస్తుంటే కమిషనర్ కు పట్టదా,, ఆదోని మునిసిపాలిటీ పరిధిలో త్రాగడానికి నీళ్లు లేక జనాలు అల్లాడిపోతున్నారు, ప్రజలు తాగడానికి మున్సిపాలిటీ ట్యాంక్ దగ్గరికి నీళ్లు ప్రజలు కోసం వస్తే మున్సిపాలిటీకి చలానా కట్టి నీళ్లు తీసుకుపోండి లేకపోతే బయట వ్యక్తులు రాకూడదని గేట్లు వేస్తున్నారు,ఆదోని మున్సిపాలిటీ ఆఫీస్ లో మాత్రం, ఎలాంటి చలానా కట్టకుండా, కార్ వాటర్ సర్వీసింగ్ చేయడానికి నీళ్లు కోదవ లేకుండా ఉన్నాయి, ఆదోని మున్సిపాలిటీ కమిషనర్ పర్మిషన్ తోనే కార్ వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారా లేక చలానా కట్టి వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారా అనేది ప్రశ్నగా మిగిలింది