పరామర్శించిన కోటగిరి సుధాకర్ బాబు

పయనించే సూర్యుడు: జూలై : 7/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు అనారోగ్యంతో ఇటీవలే స్వర్గస్తులైనా విషాద వార్త తెలుసుకున్న కోటగిరి సుధాకర్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం వారి కుమారుడు వంగా రాజేంద్రప్రసాద్ ని కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా, పెనుబల్లి గ్రామం హరిజనవాడ చెందిన సింగిశాల శీను కుమారుడు సింగిశాల వేణు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి తన పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.