పరిసరాలు పరిశుభ్రంగా ఉన్ననాడే ఆరోగ్యవంతమైన జీవితం

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 04 ( ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకున్నాడే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని కాకినాడ జిల్లా ఎంపీపీల సమాఖ్య అధ్యక్షుడు, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) పిలుపునిచ్చారు. మలేరియా వ్యతిరేక మాస ఉత్సవాల సందర్భంగా మండలంలోని జే అన్నవరం గ్రామంలో మలేరియా వ్యతిరేక మహోత్సవ ర్యాలీని ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు‌. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మలేరియా వ్యాధిపై అవగాహన కలిగి ఉన్నాడే ఆ వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చు అన్నారు. అనంతరం అయినా గ్రామ ప్రజలతో ర్యాలీగా గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఆరోగ్య కేంద్రం తొందరలోనే ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. దీంతో ప్రజలు తమ ఆరోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. జై అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు బి జయరాం మాట్లాడుతూ తమ పరిసరాల్లో దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా మలేరియా తదితర వ్యాధులకు దూరంగా ఉండవచ్చునారు. అనంతరం ఎంపీపీ గొల్లపల్లి గ్రామంలో స్వచ్ఛ రథం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు