పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని రామగిరి ఎంపీఓ మూల.సమ్మిరెడ్డి, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవం సందర్భంగా రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో "నాటుదాం ఓక చెట్టు - అమ్మ పేరు మీద" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఓక చిన్న మంచి పని కూడా పెద్ద మార్పుకు దారి తీస్తుందన్నారు. అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్.డబ్ల్యూ.ఎం రూల్స్ (2026) పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించబడింది.ముఖ్యంగా బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్ రంగుల నాలుగు రకాల డస్ట్ బిన్స్ వినియోగం, తడి- పొడి చెత్త వేర్వేరుగా నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై వివరించబడింది. అలాగే “ జలసంచయ్ జన్ భగీరథి” కార్యక్రమం కింద నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, వాటర్ కన్జర్వేషన్ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే “స్వచ్ఛ గావ్ సురక్షిత్ జల్వాయు” క్యాంపెయిన్ కింద నీటి సంరక్షణకు ప్రతి గ్రామస్థుడు బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగుల సంతోష్, వార్డు సభ్యులు జక్కుల పద్మాచందన్, కలవేన రవి, ఖండే లక్ష్మి గట్టయ్య కండి సాహితీ పోశం, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, బత్తుల.రాజమణి రమేష్, ఫీల్డ్ అస్సిటెంట్ సందేవెన జ్యోతి కుమార్, అంగన్వాడి టీచర్ తొగరు పాపమ్మ, ఆశా వర్కర్లు అంగూరి విజయలక్ష్మి, మేడ స్వరూప,కారోబర్ కొండపర్తి శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.