పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.పలాస నియోజకవర్గంలో నిర్మించబోయే ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడానికి రైతులు ఒక్క అడుగు ముందుకు వేశారు. మందస మండలం బిడిమి, బహడపల్లి, బేతలపురం, రాంపురం, లక్మిపురం, గంగువాడ గ్రామాల నుండి చాలామంది రైతులు శుక్రవారం మధ్యాహ్నం పలాస ఆర్టీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే శిరీష జాయింట్ కలెక్టర్, పలాస ఆర్డీవో సమక్షంలో భూముల నష్టపరిహారము, తోటలకు సంబంధించిన నష్టపరిహారం, ఉద్యోగ భద్రత వంటి అనేక విషయాల మీద చర్చించారు. అధికారులు ఇచ్చిన మాట ప్రకారం కొంతమంది రైతులు భూములను ఇచ్చుటక సమ్మతిని తెలియజేశారు. మిగిలిన రైతులకు కూడా ఈ విషయాల మీద స్పష్టమైన సమాచారం తెలియజేసి త్వరితగతిన ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి సహకరిస్తామని రైతులు తెలిపారు.దీనితో పలాస నియోజకవర్గం లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడిందని, ఇదే స్ఫూర్తితో అభివృద్ధిని కాంక్షిస్తూ భావితరాల కోసం మిగతా రైతులు కూడా ముందుకు రావాలని నియోజక వర్గ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని శాసన సభ్యులు గౌతు శిరీష కోరారు.రైతులు చెప్పిన అనేక విషయాల మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తప్పనిసరిగా రైతుల కోరిక మేరకు వారిని సంతృప్తి కలిగే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ముందుకు వెళ్లడమే కాకుండా ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమమునకు హాజరైన రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.
