పలుబాధిత కుటుంబాలను పరామర్శించిన -మానాల మోహన్ రెడ్డి

జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట మండలం: రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. ముందుగా తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాలూ సింగ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం గుమిర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గజేందర్ తండ్రి మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే తడపాకల్ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుకు గురైన సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు