పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సర్పంచ్ ప్రభాకర్,ఉప సర్పంచ్ కెవి …

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మరియు ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్రావు (కె.వి) శుక్రవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులు వారి ఫోటో,అతంటికేషన్, పర్సనల్ డేటా తదితర విషయాలను తిరిగి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్న నేపథ్యంలో అన్నారు గూడెం గ్రామ పంచాయతీలో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సర్పంచ్,ఉప సర్పంచ్ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ఆన్లైన్ చేసే విధానాన్ని పరిశీలన చేశారు. ఈజిఎస్ పనులు పరిశీలన : గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ పనులను శుక్రవారం వారు పర్యవేక్షించారు. పని కేంద్రానికి చేరుకొని జరిగే పనులను పర్యవేక్షించారు.ఎండ తీవ్రత అధికంగా ఉండడం చేత కూలీలు ఉదయం త్వరగా పని ప్రదేశానికి చేరుకొని త్వరగా పని ముగించుకోని ఇంటికి త్వరగా వెళ్లేలా సిబ్బంది చొరవ తీసుకొవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అంతేకాకుండా సిబ్బంది పని ప్రదేశంలో ఉండవలసిన సదుపాయాలు పక్కాగా అందుబాటులో ఉంచాలని సూచించారు. దుగ్గినేని రావమ్మకు ఘన నివాళులు : గ్రామానికి చెందిన దుగ్గినేని రావమ్మ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మరియు స్థానిక నాయకులు రామమ్మ గృహానికి చేరుకుని ఆమె భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీర మోహన రెడ్డి,ఆ పార్టీ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకటలాల్, తల్లాడ మండల మాజీ టిడిపి అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల సీనియర్ నాయకులు పులి వెంకట నరసయ్య,వార్డు మెంబర్ సూదా హనుమంతురావు, నాయకులు మారెళ్ళ దేవేందర్,పొన్నం కృష్ణయ్య,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, సుంకర సురేష్,చీకటి వెంకటేశ్వర్లు,గుమ్మ రామకృష్ణ,పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, గుమస్తా రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్ హుస్సేన్. తదితరులు పాల్గొన్నారు.