పాపన్నపేట మండల అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్ నియమాకం.

పయనించే సూర్యుడు మే 21. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ నియామకం అయ్యారు మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు మెదక్ జిల్లాలోని మండల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అందులో భాగంగానే పాపన్నపేట మండలానికి లింగంపేట నరేందర్ గౌడ్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పాపన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు