పామాయిల్ సాగు పై రైతులకు అవగాహన

పయనించే సూర్యుడు మే 22 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) ఈరోజు పెద్ద శంకరంపేట రైతు వేదికలో పామాయిల్ పంట సాగుపై లివ్ పామ్ డైరెక్టర్ రంగనాయకులు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించ కల్పించారు దీనిలో భాగంగా రైతులు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలని పామాయిల్ పంట అందుకు ఎంతో శ్రేయస్కరమని వివరించడం జరిగింది ఈ పంటతో రైతులు ప్రభుత్వ సబ్సిడీ పొంది తక్కువ పెట్టుబడి తో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా నాటిన మూడు సంవత్సరాల వరకు అంతర పంటలుగా వివిధ వేరే రకాల పంటలు వరి పంట కూడా పండించుకొని ఆదాయం పొందవచ్చని చెప్పడం జరిగింది నాలుగవ సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం ప్రతి నెలకు ఆదాయం పొందవచ్చు అని క్లుప్తంగా వివరించడం జరిగింది ఆయిల్ పామ్ పంట మార్కెటింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని మండలంలోని ఒక సెంటరు లేదా గ్రామాల వారీగా మార్కెటింగ్ కు సదుపాయం కల్పిస్తారని ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించడం జరిగింది నీటి సదుపాయం ఉన్నటువంటి రైతులందరూ కూడా పామాయిల్ కు మొగ్గు చూపాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు సుభాష్ మన్నె కృష్ణారెడ్డి కవితా ప్రశాంత్ రెడ్డి జయశీల అనంతరావు సంతోష నరేష్ గాజు కుమార్ ఆరే వెంకట్రావు రాజేశ్వరి సుభాష్ సువర్ణ అంజయ్య మండల ప్రజా ప్రతినిధులు నారా గౌడ్ రైతులు మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ ఏఈవోలు అఖిల్ వినీత్ సుభాష్ జాన్సన్ అరుణ్ పాల్గొన్నారు