పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థరేషన్ షాపుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి,

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /05:కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మానకొండూర్, అన్నారం, పచ్చునూరు గ్రామాల్లో చౌకధరల దుకాణాలను ఆయన ప్రారంభించారు.ప్రజలకు నిత్యవసర వస్తువుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శంగా పనిచేసేలా ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మానకొండూర్ మండలం మానకొండూర్, అన్నారం, పచ్చునూరు గ్రామాల్లో చౌకధరల దుకాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి రేషన్ సరుకులు అందించడమే కాకుండా సరకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నదన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాల ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు.రేషన్ దుకాణాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సంబంధిత డీలర్లకు సూచించారు. ప్రజలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్, బందెల మహేందర్, బి.మల్లయ్యగౌడ్, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, పెంచాల కిషన్ రావు,బొట్ల స్వరూప-కిషన్, రామిడి తిరుమల్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, రొంటాల శ్రీనివాస్ రెడ్డి, కనకం అశోక్, ఇర్ఫాన్, కోండ్ర సురేష్,బాపురావు, కొత్తకొండ శంకర్, కోండ్ర సంపత్, బుర్ర శ్రీధర్ గౌడ్, ఎడ్ల శ్రీధర్, తమిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.