పార్టీలకు అతీతంగా సర్పంచుల ఫోరమ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మండల అధ్యక్షుడు గూడూరు తిరుపతి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 3 మెట్ పల్లి మండల సర్పంచుల ఫోరమ్ ఎన్నిక పార్టీలకు అతీతంగా మంగళవారం రోజు నా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, మండల అధ్యక్షులుగా గూడూరు తిరుపతి, ఉపాధ్యక్షులుగా బాస లాస్య ఆనంద్,ప్రధాన కార్యదర్శి గా గుర్రం బాలరాజు, కోశాధికారిగా మారు గంగారెడ్డి ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి మండల సర్పంచ్ లు అందరూ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు, సర్పంచుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి కార్యవర్గం తీసుకెళ్లాలని కోరారు