పిడుగుపాటు ప్రమాదానికి రెండు పాడి గేదలు మృతి

పయనించే సూర్యుడు, మే 28, దేవరకొండ టౌన్ న్యూస్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటు ప్రమాదానికి గురై రెండు పాడి గేదెలు మరణించాయి. దేవరకొండ గ్రామ శివారు నడింవాగు దగ్గర పొలంలో ఉన్న గేదెలు పిడుగుపాటు ప్రమాదానికి గురై మృతి చెందాయి వీటి విలువ సుమారు రెండు లక్షలు నష్టపోయినట్లు ఆ రైతు బాధను వ్యక్తపరుస్తున్నాడు. కావున ప్రభుత్వం తరఫున తగిన సహాయం కావాలని కోరుతున్నాడు.