పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడి పునాది

సి డి పి ఓ ఎస్ కె మహబూబి.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 12 పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడి పునాది అని సి డి పి ఓ ఎస్ కే మెహబూబి పేర్కొన్నారు. గూడూరు పరిధిలోని అశోక్ నగర్ సెక్టర్ లో సాదుపేట అంగన్వాడీలో గురువారం అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి డి పి ఓ ఎస్ కే .మహబూబీ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీలు నడుస్తున్నాయన్నారు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మూడేళ్లు నిండిన ప్రతి చిన్నారిని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.