ప్రయాణించే సూర్యుడు న్యూస్ జూన్ 5 భీంగల్ ప్రతినిధి కొత్వాల లింబాద్రి జూన్ 6 నిజాంబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ 1988 89 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ ఆత్మీయ సమ్మేళనం లో కలుసుకున్నారు మీరు అందరూ కలిసి వాళ్లకు పాఠాలు చెప్పిన టీచర్లను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అందరూ చాలా సంతోషంతో ఆటపాటలతో పాత జ్ఞాపకలను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం విదేశాల నుంచి కొడిగెల మోహన్ వచ్చి అందరినీ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరహరి రవీందర్ సిహెచ్ కృష్ణ డాక్టర్ బాలరాజ్ గంగాధర్ గౌడ్ బాల నారాయణ గంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు