పయనించే సూర్యుడు న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ సహాయ కార్యదర్శి రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, ప్రజారోగ్య సంఘం జిల్లా నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపై అదనపు భారాలు మోపబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పెట్రోలుపై లీటరుకు రూ.3.29, డీజిల్పై లీటరుకు రూ.3.14, వంటగ్యాస్పై కిలోకు రూ.2 పెంచడం అన్యాయమని అన్నారు. ఈ ధరల పెంపు కారణంగా అన్ని వర్గాల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, లింగప్ప, వీరవరప్రసాద్, పరశురాం, ఉరుకుందు నాయకులు ఆది రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.