పెంచిన పెట్రోల్ డీజిల్ చమురు నిత్యవసరధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో

పయనించే సూర్యుడు న్యూస్ :మే 30, తల్లాడ రిపోర్టర్ కేంద్ర ఎన్ డి ఏ బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ తదితర నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా, మే 29న శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో తల్లాడ మండలం నరసరావుపేట గ్రామంపెట్రోల్ బంకు దగ్గర నిరసనకార్యక్రమం నిర్వహించిన అనంతరం తల్లాడ మండల కేంద్రం రైస్ ఇండస్ట్రీ వద్ద తల్లాడ భద్రాచలం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియామాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల నుండి పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద పెట్రోలు, డీజీలు, గ్యాస్ నిత్యవసర సరుకులుబస్ ఛార్జీలు, రైల్వే చార్జీలు, విమానా చార్జీలు, ఆరోగ్యానికి సంబంధించిన మందులు, కిరాణా,వ్యవసాయ పంటలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వంటి ధరలు పెంచీపేదలు మధ్యతరగతి వర్గాల మీద భారాలు మోపటం నరేంద్ర మోడీ దుర్మార్గమైన పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. విశ్వ గురువుగా చెప్పుకుంటూ ప్రజలను హింసించడం, మానసికంగా వేధించటం ప్రజల జీవితాలలో నరకయాతనగా మార్చటం ఏ మేరకు సమంజసమైనదని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోడీ బిజెపి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కి వచ్చిన తర్వాత స్వదేశీ విదేశీ బడా పెట్టుబడి వర్గాల ప్రయోజనాలకు వారి లాభాల కోసం పాటుపడుతున్నారని, ప్రజలను గాలికి వదిలేసినారని ఆయన విమర్శించారు . ప్రజలు కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమిస్తుంటే, మతోన్మాదాన్ని, అల్లర్లను రెచ్చగొట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకుంటే భవిష్యత్తులో ప్రజల చేత తిరస్కరించబడతారని ఆయన హెచ్చరించారుఈకార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తల్లాడమండల కార్యదర్శి కే వెంకటేశ్వర్లుతల్లాడ మండలసహాయకార్యదర్శి డి శ్రీనివాసరావు టియుసిఐతల్లాడ బ్రాంచ్ కమిటీ నాయకులు సిహెచ్ నరేష్ గాంధీ బాలు నరసరావు వెంకటేశ్వర్లు నారాయణ రామకృష్ణ రమణ రాఘవ లాలు ప్రసాద్ బడే తదితరులు పాల్గొన్నారు