పెద్దనాపల్లి -చిన్నింపేట బీటీ రోడ్డు పనులు పరిశీలించిన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి

పయనించే సూర్యుడు న్యూస్, మే 30 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చొరవతో పెద్దనాపల్లి నుండి చిన్నింపేట వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు, ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి స్వయంగా పరిశీలించారు. రోడ్డు పనుల నాణ్యత, నిర్మాణ వేగం,ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఆర్&బీ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్&బీ అధికారులు, నాయకులు సుంకర సత్య నారాయణ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.