పెద్దమ్మ గుడి నిర్మాణానికి 30 వేల విరాళం అందించిన ఇమ్మడి జితేందర్ రెడ్డి.

పయనించే సూర్యుడు, జులై 5, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ముదిరాజుల కుల దైవం పెద్దమ్మతల్లి గుడి నిర్మాణానికి ఇమ్మడి జితేందర్ రెడ్డి 30 వేల విరాళం ఆలయ కమిటీకి అందజేశారు. మండలంలోని కేశరెడ్డి పల్లె గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఇమ్మడి జితేందర్ రెడ్డి 30 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు జితేందర్ రెడ్డి కి ఎల్లవేళలా ఉండేలా చూడాలని తల్లిని ప్రార్థించారు.