పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు మే 29 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్ మండలం మచిన్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పెద్దమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయి” అని అన్నారు. గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడగా, గ్రామస్థులు భారీ ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమైన ఆయన వారి సమస్యలను తెలుసుకుని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలోపేతం అవుతోందని, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచిన్‌పల్లి గ్రామ సర్పంచ్ బొక్కల నాగరాజు, ఉమ్మడి దౌల్తాబాద్–రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, నాయకులు ప్రధాన కార్యదర్శి.మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్.సంపత్ రెడ్డి, సర్పంచ్ అనురాధ రమేష్, రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పట సుధాకర్ ముదిరాజ్, నాయకులు దుర్గా ప్రసాద్, సిద్ధ గౌడ్, బాలశేఖర్ రెడ్డి, మద్దెల మల్లేశ్, దుద్దెడ స్వామి, శివ లింగం, సోలిపేట ప్రసాద్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ వేడుకలు భక్తి పారవశ్యంలో కొనసాగగా, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.