పెద్ద శంకరంపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

పయనించే సూర్యుడు జూలై 5 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పదవిలో లేకపోయినా ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ ప్రతి ఇంటికి భరోసాగా నిలుస్తున్న నాయకుడు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి శంకరంపేట (అ) మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ₹2,54,500 విలువైన చెక్కులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు లబ్ధిదారులు టెంకట్టి గ్రామానికి చెందిన మారుతి 60,000 రూపాయలు జుక్కల్ గ్రామానికి చెందిన అవుసుల కృష్ణమూర్తి 60,000 రూపాయలు మల్కాపురం గ్రామానికి చెందిన రాజు గౌడ్ 10,500 రూపాయలు మూసాపేట్ గ్రామానికి చెందిన మల్లయ్య 13,500 రూపాయలు శివాయపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ 14,500 రూపాయలు విరోజీపల్లి గ్రామానికి చెందిన యాదయ్య 42,000 రూపాయలు విరోజీపల్లి గ్రామానికి చెందిన సరిత 24,000 రూపాయలు విరోజీపల్లి గ్రామానికి చెందిన జ్యోతి 29,500 రూపాయలు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ ఆసుపత్రి వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడేలా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా ప్రత్యేక చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ గౌడ్ సత్యనారాయణ సుభాష్ కోణం అంజయ్య దత్తు శంకరయ్య విఠల్ గౌడ్ సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజా సేవకు పదవి అవసరం లేదు సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు అని మరోసారి నిరూపించిన నాయకుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి.

.