02 Nov 2026 | 09:21 PM

పెద్ద శంకరంపేట మండలంలో 11,700 ఎకరాల్లో వరి కోతలు ప్రారంభం రైతులకు వ్యవసాయ అధికారుల కీలక సూచనలు

వడ్ల నాణ్యత పెరగాలంటే ఇలా చేయండి హార్వెస్టర్లకు ఆర్ పి యం తేమ శాతంపై ఏ ఈ ఓ నాగం కృష్ణ అవగాహన

పయనించే సూర్యుడు నవంబర్ 2 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరంపేట మండలంలో 11700 ఎకరాలు వానకాలం 2026 27 సంవత్సరానికి పండించడం జరిగింది వరి ధాన్యం కోసేటప్పుడు రైతులు మరియు ప్యాడి హార్వెస్టర్లు తగిన సూచనలు పాటించాలి దీనివల్ల వడ్ల నాణ్యత అనేది పెరగడమే కాకుండా ప్రక్రుమెంట్ అంటే కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి దీనిలో హార్వెస్టర్లుహార్వెస్టర్‌తో కోత కోసేటప్పుడు డ్రమ్ స్పీడ్ మరియు బ్లోవర్ వేగాన్ని సరిగ్గా సర్దుబాటు చేయాలి దీనివల్ల గింజలు పగిలిపోవడం తగ్గుతుంది
హార్వెస్టర్ మిషన్ బ్లోయర్ ను ఆన్ లో ఉంచాలి మరియు ఆర్ పి ఎం 2100 నుంచి 2200 మధ్యలో ఉండాలి వరి పంట బాగా ఎండిన ధాన్యం బట్టి వరి కోత అనేది చేయాలి తర్వాత రైతులు వరి ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి తర్వాత ప్యాడి క్లీనర్స్ ద్వారా శుభ్రపరచుకొని నాణ్యత ప్రమాణాలు మరియు గరిష్ట పరిమితులు ధాన్యం తేమ శాతం కచ్చితంగా 17% శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు కళ్లంలో టార్పాలిన్ కవర్లపై ధాన్యాన్ని సరిగ్గా ఎండబెట్టాలి క్షేత్ర స్థాయిలో రైతులు ఈ నిబంధనలను పాటిస్తే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తిరస్కరణకు గురికాకుండా మరియు కోత సమయంలో కోతలు పడకుండా సులభంగా మద్దతు ధర పొందవచ్చు సాధారణ రకం ₹2,441 క్వింటాల్‌కి సన్న వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నిర్ణయించిన గ్రేడ్-ఏ ఎం ఎస్ పి (₹2,461) కిదన అదనంగా ₹500 బోనస్ ప్రభుత్వం అందిస్తుంది
​దీనివల్ల అర్హత ఉన్న సన్న రకాలకు క్వింటాలుకు మొత్తం ₹2,961 వరకు లభిస్తుంది కమలాపూర్ లో ప్యాడి హార్వెస్టింగ్ క్షేత్రస్థాయి లో వ్యవసాయ అధికారి నాగం కృష్ణ ఏఈఓ వినీత్ పరిశీలించడం జరిగింది