పెనుగంచిప్రోలు నూతన ఎస్సై -2 గా సామినేని బాధ్యతలు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు పెనుగంచిపోలు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై 2 గా సామినేని నాగేశ్వరరావు ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన ఇదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా, ఏ ఎస్ ఐ గా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ఇటీవలే ఎస్సైగా పదోన్నతి పొంది శిక్షణ పూర్తి చేసుకొని ఇదే పోలీస్ స్టేషన్. ఎస్సై 2 గా బాధ్యతలు స్వీకరించడం పట్ల నాగేశ్వరరావు కు మండల ప్రజలు అభినందనలు తెలిపారు