పెన్షన్ లబ్ధిదారులు,ఆధార్ తో పేర్లు నమోదు చేసుకోవాలి..

తల్లాడ పంచాయతి కార్యదర్శి ఆర్ శ్రీ హరికృష్ణ

పయనించే సూర్యుడు న్యూస్ :మే 20, తల్లాడ రిపోర్టర్ పెన్షన్ లబ్ధిదారులు, ఆధార్ తో పేర్లు నమోదు *చేసుకోవాలని తల్లాడ పంచాయతి కార్యదర్శి ఆర్ శ్రీ హరికృష్ణ అన్నారు. మంగళవారం కార్యదర్శి విలేకరులతో మాట్లాడుతూ.. తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఆసరా, వికలాంగుల, పెన్షన్ లబ్ధిదారులు, ఆధార్ కార్డు తీసుకుని, తల్లాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని, ఈవో ఆర్ శ్రీ హరికృష్ణసూచించారు, ప్రభుత్వ పెన్షన్లు పొందేవారు తమ ఆధార్ కార్డులు తీసుకొని, గ్రామపంచాయతీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని, ఈ ప్రక్రియ ఈ నెల 15 నుండి, జూన్ నెల 5 వరకు నిర్వహిస్తామన్నారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యాలయానికి రాలేని వారు తమకు సమాచారం అందిస్తే ఇంటి వద్దకే వచ్చి నిర్ధారణ చేసుకుంటామన్నారు, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయించుకోని వారి పెన్షన్లు నిలిపివేయబడతాయన్నారు. ఇట్టి విషయాన్ని గమనించి పెన్షన్ దారులు సహకరించాలని కోరారు.