పెసా చట్టం, 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో మైనింగ్ నిషేధం – అయినా యథేచ్ఛగా తవ్వకాలు

★ గ్రామ సభ తీర్మానం లేకుండా అక్రమ మట్టి దందా ★ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు అక్రమ మట్టి తోలకాలు ★ ఏజెన్సీలో గిరిజనేతరుల అక్రమ మట్టి దందా - పర్మిషన్ల మాటే లేదు ★ చూసి చూడనట్టుగా మాకు ఎటువంటి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్న అధికారులు

పయనించే సూర్యుడు జూన్ 2 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండలు, గుట్టలు, కాలువ కట్టలను గిరిజనేతరులు, బడా కాంట్రాక్టర్లు అక్రమంగా తవ్వేస్తూ మట్టి, గ్రావెల్, తరలిస్తున్నారు. ‘మాకు అధికారుల పర్మిషన్ ఉంది’ అని వారు చెబుతున్నారు వాస్తవానికి ఏజెన్సీలో గిరిజనేతరులకు మట్టి, ఖనిజ తవ్వకాలకు అనుమతులు ఇచ్చే అధికారమే లేదని గిరిజన నాయకులు చెప్తున్నారు

పెసా చట్టం - 1996:

పంచాయతీ - షెడ్యూల్డ్ ఏరియాలకు విస్తరణ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో చిన్నతరహా ఖనిజాలపై గ్రామ సభ అనుమతి తప్పనిసరి. గ్రామ సభ తీర్మానం లేకుండా ఒక్క గులక రాయి కూడా తరలించడానికి వీల్లేదు. కానీ ఏన్కూరు మండలం ఏజెన్సీ ప్రాంతంలో బడా కాంట్రాక్టర్ పర్మిషన్లు ఉన్నాయని చెప్తూనే అధికారులకు గానీ గిరిజన నాయకులకు గాని పాత్రికేయులకు పర్మిషన్ లెటర్ అనేది చూపించకుండా అధికారులకు మామూలు ఇచ్చుకుంటూ ప్రజాప్రతినిధులు అండదండలతో అక్రమంగా లక్షలు విలువచేసే మట్టిని అక్రమంగా యదేచ్చగా తవ్వకాలు చేస్తున్న అధికారులు ఈ బడా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు ఈ బడా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకునే అధికారులు లేరా అని గిరిజన నాయకులు మండిపడుతున్నారు ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ సాబ్ మీరైనా ప్రత్యేక దృష్టి పెట్టి వీరి ఆగడాలను అరికట్టి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని గిరిజన సంఘ నాయకులు కోరుకుంటున్నారు

1/70 చట్టం:

తెలంగాణ భూ బదలాయింపు నియంత్రణ చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరులు భూమి కొనడం, లీజుకు తీసుకోవడం, మైనింగ్ చేయడం పూర్తిగా నిషేధం. అటువంటి చట్టాల ను లెక్కచేయకుండా చట్టానికి వ్యతిరేకంగా (విరుద్ధంగా) వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలకు పాల్పడుతున్నారు.

వాల్టా చట్టం - 2002:

నీటి వనరులు, కాలువ కట్టలు, చెరువుల నుండి మట్టి, ఇసుక తవ్వకాలకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అనుమతి కావాలి. కానీ ఏజెన్సీలో ఈ అనుమతులు గిరిజనేతరులకు ఇవ్వడానికి వీల్లేదు. అయినప్పటికీ గిరిజనేతర్లు కొంతమంది గిరిజనుల పేర్ల మీద బినామీలుగా ఏర్పడి అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్లల్లో అక్రమ దనాన్ని సంపాదిస్తున్నారు బడా కాంట్రాక్టర్ పైన ఏసీబీ దాడులు నిర్వహించి వీరి యొక్క ఆస్తుపాస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

అటవీ హక్కుల చట్టం - 2006:

అటవీ భూముల్లో గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు ఉండవు. మైనింగ్ లీజులు పూర్తిగా నిషిద్ధం. చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్న బడా కాంట్రాక్టర్లు మరి వీరి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు మట్టి, గ్రావెల్, ఇసుక, మొరం తవ్వకాలకు మైన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. ఇస్తే అది చట్ట విరుద్ధం. ఒకవేళ గిరిజనుల పేరుతో బినామీ లీజులు తీసుకున్నా, అది 1/70 చట్టం ఉల్లంఘన కింద నేరం. శిక్షార్హులు. తప్పుడు పర్మిషన్లు తీసుకుని అక్రమ మట్టి తోలకాలు జరుపుతున్నారు
వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులపై అనుమానాలు వెలువెత్తుతున్నాయి స్థానికులకు

బినామీ దందా:

గిరిజనుల పేరుతో మట్టి లీజులు తీసుకుని, వెనుక నుండి గిరిజనేతర కాంట్రాక్టర్లు తవ్వకాలు జరుపుతున్నారు.

దొంగ పర్మిట్లు:

పక్క మండలం - మైదాన ప్రాంతం పేరుతో పర్మిట్ తీసుకుని, ఏజెన్సీలో తవ్వుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన కొందరు ఇరిగేషన్ ఎస్ ఈ ,డి ఈ ఈ లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

రాత్రి వేళ దోపిడీ:

పగలు రాత్రి అనేది తేడా లేకుండా గంటల తరబడి జేసీబీలు, టిప్పర్లతో యథేచ్ఛగా మట్టి తరలింపు. ఏజెన్సీలో గిరిజనేతరులకు మేము ఎలాంటి మట్టి, మైనింగ్ అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా తవ్వకాలు జరుపుతుంటే పూర్తిగా అక్రమం. కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా మైనింగ్ ఏ డి ఒక ప్రకటనలో తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యం. ఏజెన్సీలో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న గిరిజనేతరులపై 1/70 చట్టం, పెసా చట్టం, వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. బినామీ లీజులను రద్దు చేసి, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్రమాలకు సహకరించిన మైనింగ్, ఇరిగేషన్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రతి ఏజెన్సీ మండలంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా పెట్టాలి. గిరిజన సంఘ నాయకులు స్థానికులు డిమాండ్