పయనించే సూర్యుడు మే 22 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో కోనాపూర్ గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి పేద మరియు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు వరంగా మారిందని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి అన్నారు. గురువారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సూరంపల్లి లింగవ్వకు రూ.45,000, ఎర్ర రాంబాబుకు రూ.27,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ పంచమి మాట్లాడుతూ ప్రజలు వైద్య చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అందించే సహాయం వారికి భరోసా కల్పిస్తుందని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంచమి రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంచమి వినోద్,వార్డు సభ్యుడు పంచమి రామస్వామి తో పాటు శ్రీనివాస్, బాబు, భాను,అనిల్,స్వామి పాల్గొన్నారు.