పయనించే సూర్యుడు న్యూస్, మే 29 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరం పట్టణంలో మాలకొండయ్య హాస్పిటల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టిడిపి సీనియర్ నాయకులు పైల సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పైల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ చరిత్రను తిరగరాసిన వ్యక్తి అని, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలకొండయ్య, మనుమంతు బాబ్జి, సత్తివాడ వీర్రాజు,బూర్లు సత్తిబాబు, కర్రోతు గణేష్, సామన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.