పయనించే సూర్యుడు న్యూస్ తేదీ జూన్ 5 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారామరాజు అరకులోయ డివిజన్ మండలం పరిధిలో లోతేరు పంచాయతీ పొల్లిగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి 8 మేకలు మృతి చెందాయాని ఎప్పటి లాగానే కొండపైకి మేతకు తీసుకుని వెళ్లి ఉండగా పిడుగు పడడంతో ఆ గ్రామంలోని బట్నాయక్ భాస్కర్ కు చెందిన మూడు మేకలు, బట్నాయక్ శ్రీరాములుకు చెందిన రెండు మేకలు, కేరంగి చంపకు చెందిన మూడు మేకలు మృతి చెందినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఆదివాసి గిరిజనులకు చెందిన ఈ మేకలు పిడుగుపాటుకు మృతి చెందడంతో ఆర్థికంగా వారు తీవ్రంగా నష్టపోయారని వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ కోరారు. పిడుగు పడి మేకలు మృతి చెందిన విషయాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పొద్దు బాలదేవ్ తెలిపారు పొలిగూడ గ్రామానికి చెందిన సుబ్బారావు , రామచందర్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తెలిపారు.