పయనించే సూర్యుడు గాంధారి 16/06/26 గాంధారి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పోతంగల్ కలాన్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నుండి ప్రశంసా పత్రం లభించింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ ద్వారా 90 శాతం కంటే ఎక్కువ హాజరును నమోదు చేసి, విధి నిర్వహణలో అత్యున్నత నిబద్ధత, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుత సేవలను ప్రదర్శించినందుకు ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. ఉపాధ్యాయుని అంకితభావం పాఠశాలలో క్రమశిక్షణ, నిరంతరత మరియు నాణ్యమైన వ్యాయామ విద్యా వాతావరణం ఏర్పడటానికి దోహదపడిందని విద్యాశాఖ ప్రశంసించింది. ఈ ప్రశంసా పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్, ఐఏఎస్ విద్యా శాఖ అధికారులకు పంపగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి,రంగారావు వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు శాలువ తో సన్మానించి ప్రశంసాపత్రని అందజేసినారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మండల MEO శ్రీహరి మరియు పాఠశాల కమిటీ ఛైర్మన్ , పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ అను శ్రీ బాల్ రాజు ఉప సర్పంచ్ సంజీవ్ రెడ్డి , గ్రామ ప్రజలు మరియు అధికారులు అభినందించారు.