పయనించే సూర్యుడు న్యూస్ జూలై 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి తండాకు చెందిన గుగులోత్ జగ్గయ్య నాయక్‌కు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తికావడంతో గురువారం దిశా కమిటీ సభ్యురాలు, పోలంపల్లి గ్రామ సర్పంచ్ హేమలత బాలాజీ చేతుల మీదుగా గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హేమలత బాలాజీ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహాల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత నివాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలంపల్లి గ్రామపంచాయతీకి మంజూరైన 20 ఇందిరమ్మ గృహాల్లో ఇప్పటికే 18 గృహాల నిర్మాణం పూర్తై లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకోవడం సంతోషకర విషయమన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా కృషి చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లబ్ధిదారుడు గుగులోత్ జగ్గయ్య నాయక్ మాట్లాడుతూ, తనకు ఇందిరమ్మ గృహం మంజూరు చేయించి, నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మండల అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధారావత్ బద్రునాయక్, ఉపసర్పంచ్ గుగులోత్ సర్వన్ నాయక్, వార్డు సభ్యులు రమేష్, సంపత్, లావణ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కళ్యాణ్, ధోని, నవీన్, లక్ష్మణ్, గుణశేఖర్, మహిళలు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.