పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.30.2026పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వలన నష్టపోయిన.గిరిజనులు నిర్వాసితులు శనివారం 31 వ తేదీన రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నందు.ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి మరియు ఇతర అధికారులు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడును.ఈ గ్రీవెన్స్ లో 44 గ్రామాల నిర్వాసితులు నుంచి వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమంలో ఎస్.డి.సి లు మరియు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొంటారు.కావున,పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కు రావలసినటువంటి ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ మరియు భూమికి భూమి నష్టపరిహారం చెట్లకు నష్టపరిహారం కుటుంబ ప్యాకేజీ,నిర్వాసితులుగా ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క మౌలిక సమస్యల మీద జరుగు గ్రీవెన్స్ కు వచ్చి స్వయంగా వినతి పత్రాలు అందజేయలని.ఆదివాసి జేఏసీ మండల కార్యదర్శి యలగడ నాగేశ్వరరావు,దేవీపట్నం మండల బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర తెలిపారు .