ప్రకృతి కన్ఫెర్ర చేస్తే ఓ నిరుపేద కుటుంబం రోడ్డున పడుతుందా

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దబ్బతోగు కాలనీకి చెందిన సున్నం శ్రీ దేవి అనే పేద మహిళ నివాసం ఉంటున్న తాటాకు ఇల్లు.. ఈ వర్షాల ధాటికి పూర్తిగా తడిసిపోయింది. మట్టి గోడలు పూర్తిగా నానిపోయి, ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఉన్న ఒక్కగానొక్క ఆసరా తలదాచుకునే నీడ కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంట్లో ఉన్న సామాగ్రి, తిండి గింజలు అన్నీ మట్టి దిబ్బల కింద పడి పాడైపోయాయి శ్రీదేవి బాధితురాలు రెక్కాడితే గానీ డొక్కాడన మా బతుకులకు ఈ వర్షం కోలుకోలేని దెబ్బ కొట్టింది.. ఉన్న ఒక్క చిన్న ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు తలదాచుకోవడానికి చోటు లేదు, పిల్లలతో ఈ వానలో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. రోడ్డుపైనే చలికి, వానకు నానుతూ కూర్చున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పటికైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలి. దబ్బతోగు కాలనీలో రోడ్డున పడ్డ సున్నం శ్రీ దేవి కుటుంబానికి తక్షణ సహాయంగా నిత్యావసర వస్తువులు, తాత్కాలిక నివాస వసతి కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా శాశ్వత ఇల్లు మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

.