పయనించే సూర్యుడు జూన్ 16, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జిపి రత్నం బయో రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎఫ్ఎం టి (ఫార్మర్ మాస్టర్ ట్రైనర్) గరికిన పాపయమ్మ అన్నారు. ఆరోగ్యానికి మనం తినే ఆహారమే మూలమని ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారి దగ్గర నుంచి ప్రజలకు ఉపయోగపడే అన్ని ఆహార పదార్థాలు సేకరించి వాటిని ప్రతి సోమవారం స్టాల్ గా ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ప్రజలకు అందించడం జరుగుతుందని దీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ ఎం టి గరికిన పాపీయమ్మ తెలిపారు. మిచ్చు ఉపయోగపడే అన్ని ఆహార పదార్థాలు, మరియు పంటలకు ఉపయోగపడే కషాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.