పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 వత్సవాయి మండలం, పోలంపల్లి సొసైటీ నందు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన సదస్సు సొసైటీ అధ్యక్షులు మన్నే బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు పోలంపల్లి సొసైటీ ప్రాంగణంలో స్థానిక రైతు సోదరులందరికీ ప్రకృతి వ్యవసాయం (నేచురల్ ఫామింగ) మరియు ప్రస్తుత వాతావరణ మార్పులపై (ఎల్ నినో ప్రభావం) కీలక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
.
ఈ సదస్సులోని ముఖ్య అంశాలు:
ప్రకృతి వ్యవసాయం - ప్రాముఖ్యత: రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడం, భూసారాన్ని కాపాడుకోవడం మరియు ఆరోగ్యకరమైన దిగుబడులను సాధించడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్ నినోప్రభావం - ముందస్తు జాగ్రత్తలు: రాబోయే రోజుల్లో వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షభావ పరిస్థితులు మరియు ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకుని పంటలను ఎలా కాపాడుకోవాలో వివరించడం జరిగింది. విత్తన శుద్ధి & యాజమాన్యం: ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలి, విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి, మరియు మొలక శాతాన్ని ఎలా పెంపొందించుకోవాలనే సాంకేతిక అంశాలను రైతులకు క్షుణ్ణంగా వివరించారు.
.
"భూమిని కాపాడుకుందాం - ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం…"
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దారేల్లి చిరంజీవి,ప్రకృతి వ్యవసాయ అధికారులు రాణి,వంకాయలపాటి శ్రీను , సొసైటీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు…
.