పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే.22.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ// ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ సూచనల మేరకు ప్రస్తుతం చేస్తున్న వ్యవసాయ పద్ధతులలో రసాయన ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడడం వలన భూసారం తగ్గి సాగు ఖర్చు పెరగడంతోపాటు, ఆ పంట ఉత్పత్తులను తినడం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని నివారించటానికి ప్రకృతి వ్యసాయం చేయడమే ఏకైక మార్గం.దీనిపై సభ్యులకు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించడమైనది. ఘన ద్రవ జీవామృతం తయారీ,పిచికారీ కోసం కాషాయల తయారీ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి వివరించడమైనది. పి ఎం డి ఎస్ మరియు ఏ వన్ గ్రేడ్ పద్ధతులలో సాగుచేసిన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో పుంగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శివ కుమార్ వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ ఏపీ సీఎం ఎఫ్ ఆర్ఎస్కే సిబ్బంది రైతులు పాల్గొన్నారు.