పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 12 కొనరావుపేట్ సర్పంచ్ ప్రజావాణిలో కోళ్ల ఫారం నిర్మాణం గురించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీఓ , ఆర్ఐ విచారణ చేపట్టారు. ఈ నిర్మాణం జిల్లా పరిషత్ హై స్కూల్ కు , శివాలయం కు, కళ్యాణ మండపం కు అతి సమీపంలో ఉంది. మరియు దీని దగ్గర నుండి 132 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుంది. దీని వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్తులు తమ అభ్యంతరాలను తెలిపినారు. ఈ విచారణ లో సర్పంచ్ మారు గంగారెడ్డి, ఉప సర్పంచ్ జక్కని పరంధాములు, వార్డు సభ్యులు,వీడిసి చైర్మన్ మారు సాయి రెడ్డి , వైస్ చైర్మన్ సంకె సంజీవ్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.