ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ

పయనించే సూర్యుడు న్యూస్ 7 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలంలో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలలో రెండవ విడత నందు 8 గ్రామపంచాయతీలలో గ్రామసభ నిర్వహించినైనది. ఇట్టి గ్రామ సభకు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు మరియు సర్పంచులు పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొననైనది. ఇట్టి గ్రామ సభలో ఏడు రకాల విషయాలపై చర్చించి వాటి గురించి తెలుపనైనది

.

వర్షాకాలం సన్నద్ధత సురక్షిత తాగునీరు ఘన వ్యర్ధాల నిర్వహణ జల సంరక్షణ మన సంరక్షణ మొక్కల పెంపకం వన మహోత్సవం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వరద నిర్వహణ భద్రత బడిబాట కార్యక్రమం రోడ్డు భద్రత నియమాలు మరియు మాదకద్రవ్యాల పై అవగాహన పై అంశాలపై గ్రామ సభలో చర్చించి ప్రత్యేక అవసరాల నిమిత్తం తీర్మానాలు కూడా చేయడమైనది