పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 20.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// " గత నాలుగు నెలలుగా అసంపూర్తిగా నిలిచిపోయి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారిలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. స్థానిక కట్టకిందపాళ్యం ప్రజల దుమ్ము, ధూళి సమస్యలపై, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా డాక్టర్ పి. అయూబ్ ఖాన్ ( బిజెపి నాయకులు) చేపట్టిన నిరంతర పోరాటానికి మరియు ఆయన ప్రకటించిన నిరాహార దీక్ష హెచ్చరికకు అధికారులు దిగివచ్చారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ వెంకటయ్య వారి హామీ మేరకు నిన్న సోమవారం నుండి రోడ్డు లెవెలింగ్ మరియు తారు పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగింది.