ప్రజా ప్రతినిధులు కోసం కాదు. ప్రజల కోసం అభివృద్ధి జరగాలి.కరీంనగర్ నుండి నేరుగా మైలారం వరకు లోయర్ మానేరు డాం మీదుగా బ్రిడ్జి నిర్మాణం?

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /07:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని కరీంనగర్ నుండి నేరుగా మైలారం వరకు లోయర్ మానేరు డాం మీదుగా బ్రిడ్జి నిర్మాణం జరగాలి.ముగ్గురు ప్రజా ప్రతినిధుల కోసం కాదు మూడు మండలాల ప్రజల కోసం అభివృద్ధి జరగాలి. ప్రజల అభిప్రాయం మేరకు వంతెన నిర్మాణం జరగాలి కానీ కొంద రు ప్రజా ప్రతినిధుల కోసం కాదు. గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ ఎలగందుల నుండి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ ఇది కేవలం మూడు ఊర్లకు మాత్రమే పని చేస్తుంది దీని ద్వారా ప్రజా ధనం దాదాపు 100 కోట్లు రూపాయల ప్రజా ధనం వృధా అవుతుంది అది పూర్తిగా రాజకీయ నాయకులు చేసుకునే వారి గ్రానేట్ వ్యాపారాలకు వారి వ్యవసాయ భూముల విలువలు పెంచుకోవడం కోసం వారి ఫామ్ హౌస్ లకు పోయే విధంగా మాత్రమే పనికి వస్తుంది. లోయర్ మానేరు డ్యాం మీద నుండి మైలారం గ్రామం నుండి కనుక ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతే ఇది దాదాపు 100 గ్రామాల ప్రజలకు ఉపయోగ పడుతుందని. తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మరియు ఈ బ్రిడ్జి జెఎసి అధ్యక్షుడు సంపత్ ఉదయ్ లు కలిసి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్,కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రజేందర్, తెలంగాణ రక్షణ సేన మనకోండుర్ నియోజకవర్గ ఇంచార్జ్ బుడుగె పర్షారం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.